
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు ఈ నెల3న సిటీకి రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్, నాంపల్లి సెగ్మెంట్లకు వ్యయ పరిశీలకుడిగా సుబోద్ సింగ్, లైజనింగ్ ఆఫీసర్‌గా దశరథ్, మలక్ పేట, అంబర్ పేట సెగ్మెంట్లకు వ్యయ పరిశీలకులుగా లక్ష్మీకాంత దాసప్ప, లైజనింగ్ ఆఫీసర్‌గా లక్ష్మి గణేశ్‌ను నియమించారన్నారు. వీరితో పాటు మిగతా సెగ్మెంట్లకు సంబంధించి వ్యయ పరిశీలకులు రేపు సిటీకి చేరుకుంటారని రోనాల్డ్ రాస్ తెలిపారు.