హైదరాబాద్లో BRS లీడర్ల ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

హైదరాబాద్లో BRS లీడర్ల ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు

బీఆర్ఎస్ లీడర్ల ఇళ్లల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్  మాజీ ఎమ్మల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం (నవంబర్ 07) ఉదయం తనిఖీలు చేపట్టింది ఫ్లయింగ్ స్వాడ్ టీమ్. BRS పార్టీలో ఉన్న వ్యాపార వేత్తలలో మర్రి జనార్ధన్ రెడ్డి ఒకరు. జూబ్లీహిల్స్ లోని మోతీ నగర్ లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

అదే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. కూకట్ పల్లి లోని బీఎస్పీ కాలనీలో ఉన్న ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవీందర్ రావు రెహమత్ నగర్ ఇంచార్జిగా ఉన్నారు. 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఉన్న క్రమంలో భారీ ఎత్తున డబ్బును దాచినట్లు వచ్చిన ఫిర్యాదుతో ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలకు దిగారు. నవంబర్ 11న పోలింగ్ ఉన్నందున ముందస్తుగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

సోదాల సందర్భంగా మర్రి జనార్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల సోదాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు.  అదే విధంగా పోలీసులతో మర్రి వాగ్వాదానికి దిగటంతో.. కాసేపు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.