తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. రేపు(నవంబర్ 03) నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు.. రేపు(నవంబర్  03) నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2023 నవంబర్  03వ తేదీన కీలక ఘట్టానికి తెరలేవనుంది.  అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రేపే విడుదలకానుంది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజయ్యాక  నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రేపటి నుంచి  అంటే నవంబర్ 03 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయవచ్చు.   రిటర్నింగ్ అధికారి గదిలోకి నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటుగా మరో  ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. 

ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన  సువిధ పోర్టల్ ద్వారా కూడా  ఆన్‌లైన్‌ నామినేషన్లకు కూడా అవకాశం ఉంది. అయితే ఆన్‌లైన్ నామినేషన్ వేస్తే ప్రింటెడ్ కాపీని అభ్యర్థులు  ఆర్వోకు ఇవ్వడం తప్పనిసరి. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. నవంబర్ 8 నుంచి 10 వరకు ముహూర్తాలు బాగుండటంతో ఎక్కువగా ఈ మూడు రోజుల్లో  ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.  

ఇక  నవంబర్ 13న నామపత్రాల పరిశీలన చేపట్టనండగా.. నవంబర్  15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.  అదే రోజున పోటీలో  ఎంతమంది ఉన్నారో  ప్రకటిస్తారు.  నవంబర్  30న పొలింగ్‌ నిర్వహించి .. డిసెంబర్ 3న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. డిసెంబర్ 5న ఎలక్షన్ కోడ్ ను ఈసీ ఎత్తివేయనుంది.