ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి : నిఖిల నోడల్

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి : నిఖిల నోడల్

జనగామ అర్బన్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. జీపీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకి జనరల్​ అబ్జర్వర్​గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల ఏర్పాట్ల గురించి ఎన్నికల నిర్వహణ కి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. 

అనంతరం అబ్జర్వర్​ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశం మీద అధికారులు శిక్షణ తీసుకొని పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆ తర్వాత లింగాల ఘనపురం గ్రామ పంచాయతీని కలెక్టర్​ తో సందర్శించి నామినేషన్​ ప్రక్రియ ను పరిశీలించారు. కలెక్టరేట్​లో మీడియా సెంటర్​ ను అబ్జర్వర్ నిఖిల ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​ పింకేశ్​కుమార్, జడ్పీసీఈవో మాధురి షా, వ్యయ పరిశీలకులు జయశ్రీ, డీఆర్డీవో వసంత, డీపీవో నవీన్, డీపీఆర్వో పల్లవి, ఈడీఎం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.