రాష్ట్ర అటవీ అధికారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

రాష్ట్ర అటవీ అధికారుల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

 హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఆదివారం అరణ్య భవన్​లో జరిగిన జనరల్​బాడీ సమావేశంలో అధికారులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అటవీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా వి. వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడిగా వినయ్ కుమార్ సాహు, జనరల్ సెక్రటరీగా డి. సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వి. చంద్రశేఖర్, ట్రెజరర్ గా ఎస్. మాధవ రావులు బాధ్యతలు చేపట్టారు. కొత్త కమిటీ తరపున త్వరలోనే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి తెలిపారు.