జూబ్లీహిల్స్ బైపోల్.. 10 రౌండ్లలో కౌంటింగ్..వాళ్లకు మాత్రమే అనుమతి

జూబ్లీహిల్స్ బైపోల్.. 10 రౌండ్లలో కౌంటింగ్..వాళ్లకు మాత్రమే అనుమతి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ నవంబర్ 14న  ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు  జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్.  అభ్యర్థులు, ఏజెంట్ లకు తప్ప ఎవరికి అనుమతి ఉండదని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేస్తామని చెప్పారు. 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.స్పెషల్ పర్మిషన్ తో ఈ సారి 42 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.

  కౌంటింగ్ ప్రక్రియను అబ్సర్వ్ చేయడానికి స్పెషల్ అధికారిని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది పని చేస్తారని చెప్పారు. కౌంటింగ్ ను ఎప్పటికప్పుడు RO పరిశీలిస్తారని తెలిపారు ఆర్వీ కర్ణన్.  ఫలితాలను LED స్క్రీన్ ద్వారా EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామన్నారు. 

రేపు కౌంటింగ్ కోసం భద్రత ఏర్పాట్లు చేశామన్నారు జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్. అన్ని విభాగాల పోలీసు బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు.  కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా 144 సెక్షన్ అమలులో ఉంటుందని..ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నియోజకవర్గంలో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం 4 లక్షల 13వందల 65 ఓట్లకు సగం ఓట్లు కూడా పోలవ్వలేదు. నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో కలిపి మొత్తం లక్షా 94 వేల 631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నంలోపే ఫలితం తేలనుంది.