ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం : రోనాల్డ్ రాస్

ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం : రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా  ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మాస్టర్  ట్రైనర్లకు ఎన్నికల అధికారి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించేలా పీవోలకు మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కల్పించాలని తెలిపారు. పీవోలకు పూర్తి అవగాహన కల్పించాలని మాస్టర్ ట్రైనర్లను ఆయన ఆదేశించారు.

ALSO READ: ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : కోదండరాం