V6 News

లక్సెట్టిపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన

లక్సెట్టిపేటలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సందర్శన

లక్సెట్టిపేట/దందేపల్లి/జన్నారం, వెలుగు: మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మనోహర్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో సరోజ, ఎన్నికల అధికారులు ఉన్నారు. 

దందేపల్లి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై పోలింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. మండలం లో 212 పోలింగ్ స్టేషన్స్ కు గాను 468 మంది పోలింగ్ సిబ్బంది, 177 పోలీస్ సిబ్బందిని నియమించారు. 

జన్నారంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో..

జన్నారం మండల కేంద్రంలో ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కుమార్ దీపక్ పరిశీలించారు. పోలింగ్ కు సంబంధించిన వివరాలు, ఎంత మంది సిబ్బంది హాజరయ్యారనే విషయాన్ని తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు.