
ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల షెడ్యుల్ వచ్చిందో లేదో.. సోషల్ మీడియాలో మీమ్స్తెగ వైరల్అవుతున్నాయి. టీఎస్పీఎస్సీపై క్రియేట్చేసిన ఓ పోస్టు బాగా వైరల్ అవుతున్నది. ‘ఎన్నికల నిర్వహణ కూడా టీఎస్పీఎస్సీకి ఇస్తే బాగుంటుంది. లీడర్లందరూ ప్రచారం చేసి, అలిసిపోయి డబ్బులు, మద్యం పంచినంక ఎన్నిక రద్దు అయితే తెలుస్తది.. నిరుద్యోగుల బాధ’ అనే పోస్టు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాల్లో తెగ వైరల్ అవుతోంది. అటు అభ్యర్థులపై సైతం మీమ్స్సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్అవుతున్నాయి. ‘ఓటరు అనే నేను’ పోస్టు కూడా వైరల్ అవుతోంది. ‘రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం చూపుతానని.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకుంటాను’ అనే పోస్టు ఎక్కువమంది స్టేటస్‌లలో దర్శనమిస్తోంది.