ఎన్నికల టైం: షిఫ్టులైతేనే వస్తాం

ఎన్నికల టైం: షిఫ్టులైతేనే వస్తాం
  • షిఫ్టుకు రూ.200,టిఫిన్,భోజనం, మందుకు డిమాండ్

 

ఇదిగో.. రెండు షిఫ్టులు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకొకటి. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు ఇంకొకటి. షిఫ్టుకు రూ.200 ఇయ్యాలె.టిఫిన్,మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టియ్యాలె.మందూ పోపియ్యాలె. గట్లైతెనే చెప్పురి వస్తం. ఇగ మీ ఇష్టం ”.. ఇదీ రాజకీయ పార్టీల నేతల ప్రచారానికి బస్తీవాసులు, పల్లె జనాలు తెగేసి చెబుతున్న మాట. లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనుంది. శుక్రవారం దాకా కొందరు పెద్దగా హంగామా లేకుండా నామినేషన్లు వేస్తే.. చివరి రోజున వెయ్యాలనుకుంటున్నోళ్లు తమ బలాన్ని చూపిం చుకోవాలనుకుంటున్నానారు. అందుకే స్థానిక జనాన్ని భారీగా సమీకరించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జనాన్నితరలించే బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించారు కూడా. నామినేషన్ల కోసం ఊరేగిం పుగా వచ్చే నేతలకు మద్దతుగా వచ్చే జనానికి రూ.200 నుంచి రూ.300 దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల కో రేటు ,ప్రచారానికి ఇంకో రేటు చొప్పున ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒప్పందం లేటైతే వేరే పార్టీ వాళ్లొచ్చి జనంతో మాట్లాడతారని, అప్పుడు రేటు పెరిగే అవకాశం ఉండడంతో ముందే జనంతో ఒప్పందం చేసేసుకుంటున్నామని కొందరు నేతలు చెబుతున్నారు. ఎండలు మండిపోతుండడం,రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ కూడా ఎక్కువుండడంతో జనం కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు. షిఫ్టుల వారీగా తీసుకెళ్తేనే వస్తామని తెగేసి చెబుతున్నారంటూ ఓ నేత చెప్పారు. నామినేషన్ ర్యాలీల్ లో .. వాహనాలున్న కార్యకర్తలకు మంచి గిరాకీ ఉంటోంది. మందు, బిర్యానీతో పాటు బండి పెట్రోల్ ఖర్చు బాధ్యతలనూ రాజకీయ పార్టీలే చూసుకుంటుండడంతో వాటికి డిమాం డ్ పెరిగిం ది. ఏప్రిల్ 9 వరకు ప్రచారానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు పేదోళ్లకు ఒకరకంగా ఉపాధి దొరికినట్టేనని కొందరు బస్తీ వాసులు చెబుతున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం అన్న తేడాలేవీ లేవని, ఎవరు ఎక్కువ పైసలిస్తే వారి వెంటే వెళ్తామని కొందరు బస్తీ, పల్లె జనం చెబుతున్నారు. ఎన్ని కల పుణ్యమా అని ఓ 15 రోజులు ఉపాధి దొరుకుతుందని అంటున్నారు.