Allu Arha: ‘అల్లు అర్హ’ సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!.. ఈసారి పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్?

Allu Arha: ‘అల్లు అర్హ’ సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్!.. ఈసారి పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్?

అల్లు వారి వారసురాలు ‘అల్లు అర్హ’ (Allu Arha) సందడి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచే తెలుగుపై నిండుగా మమకారం చూపిస్తూ పలు వేదికలపై ఆకట్టుకుంటోంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఇప్పటికే అర్హ ‘శాకుంతలం’సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ఆడియన్స్ను మెస్పరైజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్హ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కేవలం అల్లు అర్హ కోసమే ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 

ఈ క్రమంలో లేటెస్ట్గా ఓ క్రేజీ టాక్ బయటకొచ్చింది. ఈ అల్లు వారి పాప మరోసారి సిల్వర్ స్క్రీన్పై సందడి చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. అర్హ తన సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్. అయితే, ఈసారి తన తండ్రి అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్-సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కనిపించనుందని సమాచారం. ఇందులో ఒక మంచి పాత్రకు అర్హని తీసుకుందామని అట్లీ అడిగారట. అందుకు అల్లు అర్జున్ మొదట నో చెప్పగా.. ఆ తర్వాత కథ నచ్చి ఒకే ప్రాసిడ్ అన్నట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 
 

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చిలిపి ఆటలతో అట్ట్రాక్ట్ చేసిన ఈ తండ్రీకూతుళ్ళు..సినిమాలో ఎలా కనిపిస్తారనే విషయంలో ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అట్లీ తన సైన్స్ ఫిక్షన్లో అల్లు అర్హను నిజంగా తీసుకొస్తే.. ఐకాన్ ఫ్యాన్స్కి డబుల్ డోస్ పెంచినట్లే అని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.