Tax Notice: రిటర్న్ ఫైల్ చేయగానే టాక్స్ నోటీసు వచ్చిందా..? అయితే ఇలా చేయండి..

Tax Notice: రిటర్న్ ఫైల్ చేయగానే టాక్స్ నోటీసు వచ్చిందా..? అయితే ఇలా చేయండి..

Tax Notice on ITR: సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత చాలా మందికి నోటీసులు రావటం దేశంలో పెరిగింది. అయితే అలా నోటీసులు అందుకుంటే ఆందోళన చెందకుండా దానికి సరైన పద్ధతిలో స్పందించటం ముఖ్యం అని ఛార్టెడ్ అకౌంటెంట్లు చెబుతున్నారు. సాధారణంగా చూపిన ఆదాయంలో తేడాలు, అధిక విలువ కలిగిన ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్, డిడక్షన్స్, తప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ వంటి సమయంలో నోటీసులు వస్తుంటాయి. అధికారులను కలిసి వారు అడిగిన ప్రశ్నలకు బదులివ్వటం, సరైన డాక్యుమెంట్లను అందించటం సమస్యలను చాలా సమయాల్లో పరిష్కరిస్తుంటాయి. 

ఉదాహరణకు మీరు దాఖలు చేసిన ఐటీఆర్ యాన్యువల్ ఇన్ఫర్మెషన్ స్టేట్మెంట్ తో సరిపోలకపోతే నోటీసులు పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా పన్ను నోటీసులు అందితే ముందు అవి ఏ కారణం వల్ల వచ్చాయనే విషయాన్ని గమనించాలే కానీ ఆందోళన చెందకూడదు. పన్ను అధికారుల వద్ద ఉన్న డేటాకు రిటర్న్ ఫైల్ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారానికి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు నోటీసులు రావటం.. వాటికి తగిన డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయటమనటం సహజమే.

వడ్డీ ఆదాయం, డివిడెండ్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, పెద్ద మెుత్తంలో డబ్బు డిపాజిట్లు, ప్రాపర్టీ కొనుగోళ్లు వంటి పెద్ద ట్రాన్సాక్షలో తప్పుడు సమాచారం ఉన్నప్పుడు అధికారులు నోటీసులు పంపుతారు. నోటీసుపై అవగాహన వచ్చాక 15 రోజుల నుంచి 30 రోజుల్లోపు దానిపై స్పందించాల్సి ఉంటుంది. నోటీసులో పేర్కొన్న గడువు దాటితే పెనాల్టీలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. 

►ALSO READ | Myntra: ఈకామర్స్ దిగ్గజం మింత్రాపై ఈడీ దర్యాప్తు.. పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘనపై కేసు..

నోటీసు అందుకున్న టాక్స్ పేయర్స్ ఆదాయపు పన్ను పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి ఈ ప్రొసీడింగ్స్ కింద వారు అడిగిన అంశానికి సంబంధించిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. ఒక వేళ స్కుటినీ లేదా రీఅసెస్మెంట్ అడిగితే మీ టాక్స్ కన్సల్టెంట్ ను సంప్రదించటం ఉత్తమం. అలా చేయటం వల్ల సరైన పద్ధతిలో సమస్య పరిష్కారానికి వారు సహాయం చేస్తారు. చాలాసార్లు మిస్సింగ్ డేటా కోసం మాత్రమే నోటీసులు పంపుతుంటారు అధికారులు. ఈ సారి జరిగిన తప్పులను గ్రహించి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా టాక్స్ ఫైలింగ్ చేయటం, అకౌంటింగ్ రికార్డులు మెయిన్టెన్ చేయటానికి దోహదపడుతుంది. సరైన విధంగా స్పందిస్తే సమస్యలు పరిష్కరించుకోవటం సులువని గుర్తుంచుకోండి.