Myntra: ఈకామర్స్ దిగ్గజం మింత్రాపై ఈడీ దర్యాప్తు.. పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘనపై కేసు..

Myntra: ఈకామర్స్ దిగ్గజం మింత్రాపై ఈడీ దర్యాప్తు.. పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘనపై కేసు..

ED on Myntra: దేశంలోని ఈకామర్స్ ఫ్యాషన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటి మింత్రా. అయితే కంపెనీపై ఈడీ అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. విదేశీ పెట్టుబడి నిబంధనలకు సంబంధించి మింత్రాతో పాటు అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై దర్యాప్తులో భాగంగా కేసు రిజిస్టర్ చేసింది ఈడీ.

మింత్రా సంస్థ రూ.వెయ్యి 654 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు రూల్స్ వైలేట్ చేసినట్లు ఈడీ ఆరోపించింది. తమకు అందిన పక్కా సమాచారం ఆధారంగా మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై బెంగళూరు జోనల్ ఆఫీసులో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. మింత్రా సంస్థ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంలో ఉన్నట్లు చెప్పి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఈ డబ్బును స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. మింత్రా ఎక్కువగా తన ఉత్పత్తులను వెక్టర్ ఈకామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అమ్మగా.. విక్టర్ వాటిని రిటైలింగ్ చేసింది. 

ALSO READ | జొమాటో, బ్లింకిట్ బ్రాండ్ల కంపెనీ ఎటర్నల్ షేర్లు 11 శాతం జంప్

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వెక్టర్ సంస్థ, మింత్రా సంస్థలు ఒకే గ్రూప్ కంపెనీలు కావటమే. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవానికి మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక్కడ మింత్రా సంస్థ తన ఉత్పత్తులను నేరుగా రిటైల్ కస్టమర్లకు చేర్చకుండా మధ్యలో వెక్టర్ సంస్థను ఉపయోగించి తన వ్యాపారాన్ని హోల్ సేల్ మాదిరిగా చూపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. 100 శాతం తన ఉత్పత్తులను మింత్రా వెక్టర్ సంస్థకే విక్రయించినప్పటికీ రెండు సంస్థల యాజమాన్యం ఒక్కటే కావటంతో అది ఫెమా చట్టాల ఉల్లంఘనగా మారిందని ఈడీ చెబుతోంది.

ఫారెన్  డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చట్టాల్లో ఏప్రిల్ 1, 2010, అక్టోబర్ 1, 2010లో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం దేశంలో హోల్ సేల్ వ్యాపారంలో ఉన్న సంస్థలు తమ రిలేటెడ్ పార్టీ సంస్థలకు 25 శాతం వస్తువులను మాత్రమే అమ్మే వీలుంది. కానీ పైన కేసులో మింత్రా తన రిలేటెడ్ ఎంటిటీ అయిన వెక్టర్ సంస్థకు 100 శాతం వస్తువులను హోల్ సేల్ పద్ధతిలో సరఫరా చేసిందని తేలింది. అయితే దీనిపై ఇప్పటి వరకు మింత్రా సంస్థ అధికారికంగా స్పందించలేదు.