
న్యూఢిల్లీ: జొమాటో, బ్లింకిట్ బ్రాండ్ల కంపెనీ ఎటర్నల్ షేర్లు మంగళవారం దాదాపు 11 శాతం లాభపడ్డాయి. జూన్ క్వార్టర్ రిజల్ట్స్మెప్పించడంతో దూసుకెళ్లాయి. బీఎస్ఈలో ఈ స్టాక్ 10.56 శాతం పెరిగి రూ.299.85 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 14.89 శాతం పెరిగి రూ.311.60 వద్ద ముగిసింది.-- ఇది 52 వారాల గరిష్ట స్థాయి. ఎన్ఎస్ఈలో సంస్థ షేర్లు 10.34 శాతం పెరిగి రూ.299.80 వద్ద ముగిశాయి. ఇంట్రా-డేలో ఈ షేరు 14.55 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.311.25కి చేరుకుంది. ఎటర్నల్ షేర్లు సోమవారం దాదాపు 6 శాతం పెరిగాయి.
రెండు రోజుల్లో, కంపెనీ మార్కెట్ విలువ రూ.41,013.99 కోట్లు పెరిగి రూ.2,89,365.76 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్, నిఫ్టీ సంస్థలలో ఈ షేరు టాప్ గేనర్గా నిలిచింది. జూన్ క్వార్టర్లో ఎటర్నల్ రూ.25 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 253 కోట్ల లాభం వచ్చింది. గత ఆగస్టులో ఆర్బ్జెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వేస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లను కొనుగోలు చేయడం వల్ల గత ఏడాది ఇదే క్వార్టర్‌తో ఫలితాలు పోల్చదగినవి కాదని ఎటర్నల్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.