ప్రీమియం ఫీచర్లతో టాటా నానో.. రూ.1.45 లక్షలకే..

ప్రీమియం ఫీచర్లతో టాటా నానో.. రూ.1.45 లక్షలకే..

టాటా మోటార్స్ ఈ ఏడాది చివరిలోపు  టాటా నానోను స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీచర్లతో తిరిగి తీసుకురావాలని చూస్తోంది. ఈ కాంపాక్ట్ హ్యాచ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ 40 కిమీ/లీ మైలేజ్, 624సీసీ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌తో  రానుంది. ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ హెడ్‌‌‌‌‌‌‌‌ల్యాంప్స్, 7-అంగుళాల టచ్‌‌‌‌‌‌‌‌స్క్రీన్, 4 ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు, ఏబీఎస్‌‌‌‌‌‌‌‌, సన్‌‌‌‌‌‌‌‌రూఫ్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు ఉంటాయి. 

ధర రూ.1.45 లక్షల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. రూ.1,000  ఈఎంఐతో ఈ కారు  అందుబాటులో ఉంటుందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దీంతో పాటు  నానో ఈవీని కూడా లాంచ్ చేయాలని టాటా మోటార్స్ చూస్తోంది. ఇది ఫుల్ చార్జ్‌‌‌‌‌‌‌‌పై 250 కిమీ రేంజ్ ఇస్తుందని అంచనా.
 

కార్ల ప్రపంచంలో టాటా నానో ఓ విప్లవం అని చెప్పాలి. లక్ష రూపాయల బేసిక్ ధరలోనే కారు అందించటం అనేది ఓ సంచలనం. నానో కారుకు ఆదరణ లేక పోవటంతో నిలిపివేసింది టాటా కంపెనీ. ఇప్పుడు మళ్లీ రీలాంఛ్ చేయాలని చూస్తుందని.. పూర్తి ఎలక్ట్రికల్ గా.. ఈవీగా తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పోటెత్తుతున్నాయి. టాటా నానో ఎలక్ట్రికల్ కారు..2024 సంవత్సరం చివరి నాటికి రోడ్డెక్కబోతున్నదని.. అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. అయితే కాస్త ఆలస్యమైనా అదిరిపోయే ఫీచర్లతో త్వరలోనే మార్కె్ట్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది టాటా కంపెనీ. ధర, మైలేజ్, ఫీచర్స్, కారు మోడల్ ఇలా ఉంటుం దం టూ కొన్ని వార్తలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ విశేషాలు ఇలా..

నానో ఎలక్ట్రికల్ కారు ఫీచర్స్ :

  • నాలుగు డోర్లు ఉంటాయి. 4 సీట్లు.
  • 17 kWh బ్యాటరీ
  • ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్
  • R12 profile టైర్లు
  • 2 ఎయిర్ బ్యాగ్స్
  • 3.3 kW, AC charger
  • మ్యూజిక్ సిస్టమ్
  • పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు
  • ఫ్రంట్ పవర్ విండోస్
  • ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చేస్తుందంట టాటా. బేసిక్ ధర 5 లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల సమాచారం. హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.