Hari Hara Veera Mallu X Review: ‘హరిహర వీరమల్లు’ X రివ్యూ.. పవన్ కళ్యాణ్ సినిమాకు పబ్లిక్ టాక్‌ ఎలా ఉందంటే?

Hari Hara Veera Mallu X Review: ‘హరిహర వీరమల్లు’ X రివ్యూ.. పవన్ కళ్యాణ్ సినిమాకు పబ్లిక్ టాక్‌ ఎలా ఉందంటే?

పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఇవాళ (జులై 24న) థియేటర్లలో సందడి చేయబోతోంది. నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల (జులై 23న) ప్రీమియర్ షోలు పడ్డాయి. అలాగే ఓవర్సీల్‌లోనూ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. పవన్‌ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రిలీజైన వీరమల్లు.. అంచనాలకు తగ్గట్టుగా ఉందా? సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారనేది X లో తెలుసుకుందాం. 

16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తుల నాటి కాలం కథ ఇది. ఆంధ్రప్రదేశ్ లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం, చేతులు మారుతూ చివరికి లండన్ మ్యూజియానికి ఎలా చేరుకుంది? ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు అనేది ప్రధాన కథ.

హరిహర వీరమల్లు సినిమాకు మిక్సెడ్ టాక్ అందుకుంది. వీరమల్లు పాత్రని, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ఫస్టాఫ్ సినిమాకి హైలైట్ కాగా, సెకండాఫ్లో  వచ్చే ప్రీ క్లైమాక్స్ ప్రధానబలమని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని నెటిజన్ల నుంచి టాక్ వినిపిస్తోంది.

సెకండాఫ్లో ఫస్టాఫ్ని మించి కథ, కథనాలు లేకపోవడంతోపాటు, చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన క్లైమాక్స్ ఫైట్ అదిరిపోతుందని.. ఆపై కథ మరింత రసవత్తరంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ పాజిటివ్ అంశాలతో పాటు నెగిటివ్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. సినిమాకు VFX, CG వర్క్స్ భారీగా దెబ్బతీసిందని, పవన్‌ గుర్రపు స్వారీ సీన్స్ ఏ మాత్రం మెప్పించే విధంగా లేవని కామెంట్లు చేస్తున్నారు. అయితే, క్రిష్ బయటకి రావడం సినిమాకు పెద్ద మైనస్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక నెటిజన్ తన రివ్యూను షేర్ చేస్తూ.. ‘హరిహరవీరమల్లు అనేది ఒక పేలవమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. అవుట్ డేటెడ్  స్క్రీన్‌ప్లేతో పాటు టెక్నికల్‌గా చాలా పూర్‌గా ఉంది. ఫస్టాఫ్ కొంతవరకు పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ తో పాటు కుస్తీ పోరాటం వంటి యాక్షన్ సీన్స్  బాగా వర్కౌట్ అయ్యాయి.  రొటీన్‌ స్క్రీన్‌ప్లే అనిపించినప్పటికీ, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేస్తుంది. అయితే, సెకండాఫ్ కంప్లీట్గా బోర్ కొట్టిస్తుంది. దర్శకుడు కథాంశాన్ని పూర్తిగా కల్పిత సీన్స్తో నింపేశాడు. ఈ సీన్స్ కథకు దిశానిర్దేశం లేనట్లుగా అనిపిస్తుంది.

టెక్నికల్గా చూసుకుంటే, VFX పూర్ క్వాలిటీగా ఉంది. చాలా సీన్స్, ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చేవి దారుణమైన అనుభవాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ సినిమాకు డబ్బింగ్ మరొక మైనస్ అని, పవన్ కళ్యాణ్ సహా అనేక పాత్రలకు లిప్-సింక్ మరియు వాయిస్ క్లారిటీ ఇష్యూ ఉందని తన రివ్యూలో నోట్ చేశాడు.

అయితే, కీరవాణి మ్యూజిక్ వీరమల్లు సినిమాకు ఏకైక రక్షణగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఫస్టాఫ్ లో మాత్రమే పవన్ కళ్యాణ్ తన మార్క్ పనిచేసిందని.. అందుకు కీరవాణి సంగీతం తోడ్పడిందని.. మిగిలినవన్నీ చాలా నిరాశపరిచాయని’ ఓ నెటిజన్ తన రివ్యూలో పంచుకున్నాడు.