డాక్యుమెంట్లు ఎప్పుడూ మీ వెంటే ఉండాలి : అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వార్నింగ్!

డాక్యుమెంట్లు ఎప్పుడూ మీ వెంటే ఉండాలి :  అమెరికాలోని గ్రీన్ కార్డ్ హోల్డర్లకు వార్నింగ్!

US Green Card: అమెరికాలో ప్రస్తుతం వీసాలపై నివసిస్తున్న వారు కఠినతరం చేయబడిన నిబంధనలతో బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. చిన్న తప్పులకు కూడా విదేశీయులను డిపోర్ట్ చేస్తూ హోం లాండ్ సెక్యూరిటీ తీసుకుంటున్న నిర్ణయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

ఇదే సమయంలో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ పోలీసులు అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. గ్రీన్ కార్డ్ పై నివసిస్తున్న వ్యక్తులు తమకు సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లను ఎల్లప్పుడు తమతో పాటు క్యారీ చేయాలని సూచించింది. ఫెడరల్ అధికారులు మిమ్మల్ని ఆపినప్పుడు డాక్యుమెంట్లు లేనట్లు గమనిస్తే జరిమానా విధించవచ్చని చెప్పారు. 

పౌరులు కానివారు ఎల్లప్పుడూ అమెరికాలో తమ చట్టపరమైన హోదాకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని ట్రంప్ పరిపాలన హెచ్చరిస్తోంది. చట్టబద్ధమైన శాశ్వత నివాసితులపై కఠిన చర్యలు కొనసాగుతాయని.. వారు దేశంలో చట్టబద్ధంగా నివసిస్తున్నందున వారు శిక్షించబడరని కాదని బోర్డర్ పోలీసులు చెప్పారు. శాశ్వత నివాసితులు చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిని కూడా బహిష్కరించవచ్చని యూఎస్ విదేశాంగ శాఖ గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

తప్పక వెంట ఉండాల్సిన డాక్యుమెంట్లు..
* యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఇచ్చే కార్డులు క్యారీ చేయాలి. ఇది సాధారణంగా "A" తో ప్రారంభమవుతుంది.
*  గ్రీన్ కార్డ్‌లో ఫోటో, A- నంబర్, అడ్మిషన్ కేటగిరీ మరియు గడువు తేదీ ఉంటాయి.
* అమెరికాలో నివాస, పనిచేసే హక్కుకు సంబంధించిన డాక్యుమెంట్లు
* ఉద్యోగానికి అధికారిక పత్రం అని పిలువబడే వర్క్ పర్మిట్ ఫారం I-7666 క్యారీ చేయాలి.
* విదేశీయులు అమెరికాలో ఎంట్రీ, ఎగ్జిట్ కి సంబంధించిన డాక్యుమెంట్లు కలిగి ఉండాలి. 

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం 14 ఏళ్లు పైబడిన పౌరులు కాని వ్యక్తులు 30 రోజుల కంటే ఎక్కువ కాలం యూఎస్ లో ఉంటే వారు తప్పకుండా తమ విదేశీయుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ ఎల్లప్పుడూ తీసుకెళ్లాలి. 

►ALSO READ | ED Raids: అనిల్ అంబానీ YES బ్యాంక్‌ను ముంచాడా.. 3 వేల కోట్లు ఫ్రాడ్ చేశాడా..?