IND vs ENG: నాలుగో టెస్టులో పంత్‎కు గాయం.. రక్తంతో ఆట మధ్యలోనే మైదానం వీడిన వికెట్ కీపర్

IND vs ENG: నాలుగో టెస్టులో పంత్‎కు గాయం.. రక్తంతో ఆట మధ్యలోనే మైదానం వీడిన వికెట్ కీపర్

బ్రిటన్: మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఇంగ్లాండ్‎తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‎కు తీవ్ర గాయమైంది. తొలి రోజు ఆటలో భాగంగా మూడో సెషన్‎లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. వోక్స్ బౌలింగ్‎లో రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ కాలికి తీవ్ర గాయమైంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది. ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. 

ALSO READ | Sarfaraz Khan: 2016లో RCB నన్ను జట్టు నుంచి తప్పించింది.. కోహ్లీ మాటల కారణంగానే సన్నగా అయ్యాను

పంత్ రిటైర్డ్ హార్ట్‎గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్‎కు వచ్చాడు. కాగా, మూడో టెస్టులో చేతి వేలి గాయంతో ఇబ్బందిపడిన పంత్‎కు.. మాంచెస్టర్ టెస్టులో కాలికి గాయం కావడం ఆందోళన కలిగిస్తుంది. పంత్ గాయంపై క్లారిటీ వస్తే.. రెండో రోజు బ్యాటింగ్ చేస్తాడో లేదో తెలుస్తోంది. ఈ సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న పంత్ వరుసగా గాయపడటంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్, పంత్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. ఓపెనర్స్ యశస్వీ జైశ్వాల్ 58, రాహుల్ 46 రాణించగా.. కెప్టెన్ శుభమన్ గిల్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పర్చాడు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వన్డే తరహాలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ పంత్ 37 పరుగులు వద్ద గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంత్ నొప్పితో అల్లాడుతూ మైదనాం వీడాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా 12, శార్థుల్ ఠాకూర్ 10 ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్ల పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు.