అవును.. ఆ రష్యా విమానం కూలిపోయింది : 49 మంది చనిపోయారు..!

అవును.. ఆ రష్యా విమానం కూలిపోయింది : 49 మంది చనిపోయారు..!

అదృశ్యం అయిన రష్యా విమానం కూలిపోయింది. ల్యాండ్ కావాల్సిన టిండా ఎయిర్ పోర్ట్ కు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయి.. మంటల్లో చిక్కుకున్నట్లు రష్యా అధికారులు అధికారికంగా ప్రకటించారు. పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

 విమానంలో ఉన్న 49 మంది ప్రయాణికులు చనిపోయినట్లు భావిస్తున్నామని వెల్లడించారు రష్యా అధికారులు. ఈ 49 మందిలో 43 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. An 24 ట్విన్ టర్బో ప్రాస్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన ఈ రష్యా విమానం.. రష్యాలోని బ్లాగోవెష్ చెన్స్కో నుంచి టిండా అనే ప్రాంతానికి వెళుతుంది. మార్గమధ్యలో చైనా సరిహద్దుల్లోని అముర్ అనే అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు రష్యా అధికారులు వెల్లడించారు.

ఇండియాలో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం మరువక ముందే అలాంటి ఘోర ప్రమాదం రష్యాలో చోటు చేసుకుంది. మొత్తం 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలి పోవడంతో 49 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చైనా తూర్పు ప్రాంతంలో విమానం కూలిపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 

Also read:చైనా సరిహద్దుల్లో రష్యా విమానం మిస్సింగ్

విమానం బయలు దేరిన తర్వాత మధ్యలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ కాంటాక్ట్ కోల్పోయింది. కొన్ని నిమిషాత తర్వాత విమానం కూలినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.  విమానం కూలిన ప్రదేశంలో మంటలు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

సైబీరియా లో ఉన్న అంగారా ఎయిర్ లైన్స్ నిర్వహిస్తున్న An-24 విమానం కూలిపోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. అముర్ ప్రాంతంలోని టిండా టౌన్ కు చేరాల్సిన విమానం కూలిపోవడం అధికారులను కలవరపెడుతోంది. టిండా ఎయిర్ పోర్ట్ లో రెండో సారి ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో విమానం కూలిపోయినట్లు రష్యా న్యూస్ ఏజెన్సీ ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది. 

గవర్నర్ వసిలీ ఓర్లోవ్ చెప్పిన వివరాల ప్రకారం విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఐదుగురు చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరితో కలుపుకుని 6 మంది సిబ్బందితో కలుపుకుని మొత్తం 49 మంది విమానంలో ఉన్నట్లు చెప్పారు. ఫ్లైట్ ను కనుగొనేందుకు అన్ని రకాల సహాయక చర్యలను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.