
రష్యాకు చెందిన విమానం.. చైనా వెళుతూ అదృశ్యం అయ్యింది. ఎయిర్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి. సిగ్నల్స్ అందని విమానం సురక్షితంగా దిగిందా లేదా.. ఎటు వెళ్లింది.. ఎక్కడ ఉంది అనే వివరాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.
రష్యాకు చెందిన An 24 అనే విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం రష్యాలోని బాగోవెష్ చెన్స్కో నుంచి టిండా అనే ప్రాంతానికి వెళుతుంది. మొత్తం 570 కిలోమీటర్లు. 2025, జూలై 24వ తేదీ ఉదయం ఈ విమానం 43 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో కలిసి బాగోవెష్ చెన్స్కో నుంచి బయలుదేరింది. టిండాకు వెళ్లే మార్గమధ్యలో చైనా సరిహద్దుల్లోని అముర్ అనే ప్రాంతంలో మిస్ అయ్యింది. అముర్ దగ్గర నుంచి రాడార్ లో ఈ విమానం సిగ్నల్స్ కనిపించలేదు. అముర్ అనే ప్రాంతం చాలా దట్టమైన అటవీ ప్రాంతం. దీంతో విమానం ప్రమాదానికి గురైందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తు్న్నారు ఫార్ ఈస్టర్న్ రష్యన్ ప్రాంతానికి చెందిన గవర్నర్.
Also read:-ఐటీ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వొద్దు : గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆర్డర్స్
An 24 అనే ఈ విమానం ప్రయాణికులు, రవాణా కోసం.. రెండింటి కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం అయితే ప్రయాణికులతో వెళుతుంది ఈ విమానం. విమానం అదృశ్యం కావటంపై ఇప్పటికే రష్యా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ప్రత్యేక విమానాలు, రెస్క్యూ సిబ్బందితో రెండు విమానాలను పంపింది. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చైనా దేశం సాయం కూడా తీసుకుంటున్నారు. చైనా దేశానికి చెందిన ఎయిర్ కంట్రోల్ నుంచి కూడా విమానం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.