ఐటీ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వొద్దు : గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆర్డర్స్

ఐటీ ఉద్యోగాలు భారతీయులకు ఇవ్వొద్దు : గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ట్రంప్ ఆర్డర్స్

ఇండియాపైన, భారతీయులపైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు కక్కుతూనే ఉన్నారు. ఇండియా తమకు చిరకాల మిత్రుడు అంటూనే.. సందర్భం వచ్చిన ప్రతీసారి ఇండియాపై తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా బుధవారం (జులై 23) గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ఇండియాలో ఉద్యోగ నియామకాలు ఆపేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. 

వాషింగ్ టన్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో ప్రసంగించిన ట్రంప్.. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు ఆపి.. అమెరికాపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వద్దని ఆదేశించారు.

అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్ సెట్ నుంచి బయటకురావాలని అన్నారు ట్రంప్. దీంతో తమ కంపెనీలు అమెరికన్లను మరిచోపుతున్నాయనే ఫీలింగ్ లో అమెరికన్లు ఉన్నారని అన్నారు . అమెరికాలో ఉన్న ఫ్రీడం ను ఉపయోగించుకుని పెద్ద పెద్ద కంపెనీలు ఎదిగాయని.. కానీ పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెడుతూ ఆ దేశాలను డెవలప్ చేస్తున్నాయని మండి పడ్డారు. 

Also Read:-చైనా సరిహద్దుల్లో రష్యా విమానం మిస్సింగ్

అమెరికన్  కంపెనీలు చైనాలో సంస్థలను ఏర్పాటు చేస్తూ, ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేస్తూ.. ఐర్లండ్ లో లాభాలు క్రియేట్ చేస్తున్నాయన్నారు. ఈ విషయం కంపెనీలకు అర్థమవుతుందా.. అని ప్రశ్నించారు ట్రంప్. ఏఐ రేస్ లో అమెరికా ముందుండాలని.. అందుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికాను ముందుంచాలని.. నిజమైన దేశ భక్తిని కంపెనీలు చాటుకోవాలని సూచించారు. 

టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికా కోసమే పనిచేయాలి.. అమెరికాను అన్ని రంగాల్లో మొదట్లో ఉంచడమే మన కర్తవ్యం.. అందులో ఏఐ టెక్నాలజీలో ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలి.. దాని కోసం కంపెనీలు పనిచేయాలని అన్నారు ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన మూడు ఎక్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు.