
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముం దే ప్రచారం ఆపేయాలి. దీంతో ఇన్ని రోజులుగా కొనసాగిన మైకులు, డీజేల హోరుకు బ్రేక్ పడనుంది. రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, ప్రచార రథాలు, వాహనాలపై డిజిటల్ డిస్‌ప్లే లకు ఫుల్‌స్టాప్ పడనుంది.
సాయంత్రం ఐదు వరకే..
సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ముగుస్తుం ది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్ లో సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. నిర్ణీత సమయం తర్వాత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. ఈ మేరకు రాజకీయ నాయకులు ఎలాంటి సమావేశాలకు హాజరుకాకూడదు, ప్రసంగాలు చేయకూడదు. టీవీలు, సోషల్ మీడియాల్లో కూడా ప్రచారం నిర్వహించకూడదు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు. రాష్ట్రం లో 17 లోక్ సభ స్థానలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.