ఒకప్పుడు టాలీఫుడ్ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్దే.. ప్రస్తుతం అవకాశాల కోసం పాకులాడుతోంది. అయితే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ బుట్టబొమ్మ.. గతేడాది సూపర్ స్టార్ రజినీ కాంత్ 'కూలీ' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు విజయ్ జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఇది ఈ సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్చి ఉండగా సెన్సార్ జాప్యం వల్ల వాయిదా పడింది.
- ALSO READ | Mrunal Thakur: ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ క్లారిటీ.. సముద్రంలో చిల్ అవుతూ స్టైలిష్ కౌంటర్!
బాలీవుడ్ లో లక్ ను పరీక్షించుకుందామని చూసినా సక్సెస్ ను సొంతం చేసుకోలేపోయింది. ఇటు టాలీవుడ్ చిత్రాలకు దూరమైంది. వచ్చిన ఆఫర్స్ ను సద్వీనియోగం చేసుకుంటూ.. హీట్ కోసం ఎదురుచూస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో తన కెరీర్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టింది . కొన్ని నెలల క్రితం నేను ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటించా. అందులో చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరో నా పర్మిషన్ లేకుండానే నా క్యారవాన్ లోకి వచ్చాడు. అది చూసి నేను షాకయ్యా. ఇదేంటి ఈ హీరో సన్ను అడగకుండానే లోపలికి వచ్చాడని చాలా ఇబ్బందిగా సీల్ అయ్యాను అని ఆవేదనను వ్యక్తం చేసింది.
కానీ ఆస్టార్ హీరో మాత్రం మాత్రం బయటికి వెళ్లలేదు. నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోవదానికి ప్రయత్నించాడు. దాంతో ఆ హీరో ప్రవర్తన అసభ్యంగా ఉండడంతో కోపంతో వెంటనే చెంప చెల్లు మనిపించానని హేగ్డే వెల్లడించింది. దీంతో అతను కోపం తెచ్చుకొని అప్పటినుంచి నాతో మాట్లాడడం మానేశాడు. అంతేకాదు అసినిమాలో మిగతా సీన్స్ కూడా నాతో చేయడం ఇష్టం లేక డూప్ ని పెట్టి చేయించాడు అంటూ చెప్పుకొచ్చింది. పూజా చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సినీ సర్కిల్స్ తోపాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
