Nims ఆస్పత్రి పార్కింగ్ లో అగ్నిప్రమాదం..ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన పేషెంట్లు

Nims ఆస్పత్రి పార్కింగ్ లో అగ్నిప్రమాదం..ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన పేషెంట్లు

హైదరాబాద్: నిమ్స్​పార్కింగ్ ఆవరణలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ( అక్టోబర్​ 18)  ఉదయం పార్కింగ్​ లో ఉంచిన ఎలక్ట్రిక్​బైక్​ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట పొగలు, ఆ తర్వాత మంటలు చెలరేగి పెద్ద ఎత్తున  పొగ, మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో పేషెంట్లు, వారి అటెండెంట్లు, నిమ్స్​ సిబ్బంది పరుగులు పెట్టారు. 

పార్కింగ్ లో పెట్టిన బైక్​ లోంచి ఆకస్మాత్తుగా పొగలు రావడంతో గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది బైక్​ ను బయటికి లాగారు. అయితే  ఈలోపే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నీళ్లు, ఫోం వాడినా కూడా మంటలు చల్లారలేదు. దాదాపు అరంగపాటు నిమ్స్​ పార్కింగ్​ ఆవరణలో టెన్షన్​ టెన్షన్​ వాతావరణం నెలకొంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆస్పత్రి భవనాలకు వ్యాపిస్తాయోమోనని భయపడ్డారు. చివరికి మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.