ఎలక్ట్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు​లు రోడ్డెక్కినయ్

ఎలక్ట్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు​లు రోడ్డెక్కినయ్

బ్రిటన్‌‌‌‌లో ట్రాఫిక్​ మధ్య టెస్ట్ రన్ సక్సెస్

దాదాపు పదేండ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. అయితే తొలిసారి డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ బ్రిటన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్‌‌‌‌‌‌‌‌ టెస్ట్ రన్ నిర్వహించగా.. సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ పూర్తయింది. అరిగో కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు త్వరలోనే పబ్లిక్‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి.
మూడు కిలోమీటర్ల ట్రయల్ రన్
అరిగో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులకు ‘ఆటో షటిల్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మూడు బస్సులను మొదటగా మ్యాంగ్లే రోడ్ పార్క్ – కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మధ్య నడిపించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫస్ట్ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం నిర్వహించారు. మూడు కిలోమీటర్ల రూట్‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాఫిక్ మధ్య దీనిని నడిపారు. ఈ ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌లో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ గానీ, ఇతర వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టడం గానీ లేకుండా ప్రయాణం పూర్తి కావడంతో కేంబ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌ ఇతర రీసెర్చ్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌లతో పాటు రైల్వే స్టేషన్లు, పార్కులు వంటి వాటికి సర్వీసులు నడిపిస్తామని అరిగో కంపెనీ తెలిపింది. అయితే ఆయా ప్రాంతాలన్నింటిలోనూ జర్నీని ప్రస్తుతానికి ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్స్‌‌‌‌‌‌‌‌గానే పరిగణిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. త్వరలోనే యూకేలోని మరిన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయి రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని తెలిపారు. 
ఫస్ట్ ట్రయల్‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌లో సమస్యలు వచ్చినా, ఎమర్జెన్సీ సమయాల్లో  మాన్యువల్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌పైనా నడిచేలా ఈ బస్సుల్లో సెటప్‌‌‌‌‌‌‌‌ ఉందని అరిగో కంపెనీ సీఈవో డేవిడ్ కీన్ తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను రియాలిటీలోకి తేవడంలో.. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ మధ్య ట్రయల్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ కావడం ఒక మైల్ స్టోన్‌‌‌‌‌‌‌‌ అని ఆయన అన్నారు. గతంలో గోల్ఫ్ కోర్టులు లాంటి ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ లేని చోట టెస్ట్‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌‌‌‌‌ నిర్వహించగా.. ఇప్పుడు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ అన్ని వెహికల్స్ మధ్య రోజువారీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో సెల్ఫ్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ బస్సును ఎటువంటి సమస్యలు లేకుండా నడిపామని చెప్పారు. అయితే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఈ ఫస్ట్ ట్రయల్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ ప్రతినిధులు, పబ్లిక్‌‌‌‌‌‌‌‌తో పాటు యూకే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ రేచల్ మెక్లాన్ ప్రయాణించారు. పర్యావరణానికి ఎటువంటి హానీ చేయకుండా నడిచే బస్సులు ఫ్యూచర్ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. 
కరోనా వల్ల లేట్
ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ సెల్ఫ్ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ బస్సులను గతేడాదే రోడ్డుపైకి తీసుకురావాల్సిందని, కానీ కరోనా మహమ్మారి వల్ల ట్రయల్స్ నిర్వహించలేకపోయామని అరిగో కంపెనీ సీఈవో డేవిడ్ చెప్పారు. ఇప్పుడు ఏయే రూట్లలో తిరగాలన్నది మ్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కూడా పూర్తయిందన్నారు. 24 గంటలూ అందుబాటులో  ఉండే బస్సులో ప్రయాణించేందుకు తమ కంపెనీ యాప్‌‌‌‌‌‌‌‌ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

50 కిలోమీటర్ల స్పీడ్
ప్రపంచంలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ సెల్ఫ్ డ్రైవింగ్ పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్ వెహికల్ తామే తయారు చేశామని అరిగో కంపెనీ చెబుతోంది. ఈ బస్సు 22 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌‌‌‌తో నడుస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే 193 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. ఈ బస్సు మ్యాగ్జిమం స్పీడ్‌‌ గంటకు 50 కిలోమీటర్లు. దీనిలో పది సీట్లు ఉంటాయి. వికలాంగులు బస్‌‌ ఎక్కేందుకు ఆటోమేటిక్ ర్యాంప్‌‌ కూడా ఉంది. దీనిపై నుంచి వీల్‌‌ చైర్‌‌‌‌ను నేరుగా బస్‌‌లోకి తీసుకెళ్లొచ్చు. లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (లైడర్) సెన్సర్ టెక్నాలజీ సాయంతో ఈ బస్సు రూట్‌‌లో వచ్చే వెహికల్స్‌‌ను గుర్తిస్తూ ముందుకు వెళ్తుంది. లేజర్‌‌‌‌ స్కానర్లు, సెన్సర్లతో పాటు కెమెరాలు కూడా బస్సుకు అన్ని వైపులా ఫిట్‌‌ చేసి ఉంటాయి. దీని ద్వారా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా సేఫ్‌‌గా బస్సును నడింపించేలా కంట్రోల్ సిస్టమ్‌‌ రూపొందించామని కంపెనీ చెప్పింది.