శ్రీశైలం డ్యామ్​ వద్ద పెద్ద శబ్దాలు ... విద్యుత్​  నిలిపివేసిన అధికారులు

శ్రీశైలం డ్యామ్​ వద్ద పెద్ద శబ్దాలు ... విద్యుత్​  నిలిపివేసిన అధికారులు

శ్రీశైలం  డ్యామ్​ వద్ద సోమవారం ( మే 1) పెద్ద శబ్దాలు వచ్చి దట్టంగా పొగలు అలముకున్నాయి.  దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇరిగేషన్​ అధికారులకు సమాచారం ఇచ్చారు.  అయినా వారు స్పందించలేదని వాపోయారు.  ఇంత జరుగుతున్నా అధికారులు రాకపోవడంపై.. అసలు సమస్య ఎక్కడ ఉందో తెలియడం లేదని భయాందోళనలు వ్యక్తం చేశారు . డ్యామ్​ ఛేంజ్​ ఓవర్​ స్విచ్​ వద్ద ప్రమాదం జరగడంతో .. అధికారులు అప్రమత్తమై  విద్యుత్ సరఫరాను డ్యామ్​ అధికారులు నిలిపి వేశారు.

శ్రీశైలంలో వర్షం దంచికొట్టింది. వర్షం ధాటికి ప్రధాన వీధులన్ని జలమయం అయ్యాయి. వర్షంకారణంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులు వసతిగృహాలకు పరిమితమయ్యారు.మరోపక్క శ్రీశైలంలో శ్రీగిరికాలనీ ,కొత్తపేటలో బురద, ఎర్రమట్టి నీళ్లు దిగువకు కొట్టుకొస్తున్నాయి. వర్షం ధాటికి చెట్టు నెలకొరిగింది. ఉమా రామలింగేశ్వర సత్రం రోడ్డులో కారుపై చెట్టు విరిగి పడింది. కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇప్పుడు డ్యాం వద్ద  పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో  ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.