కేంద్రం దుర్మార్గపు సవరణలు తీసుకొస్తోంది

కేంద్రం దుర్మార్గపు సవరణలు తీసుకొస్తోంది
  • మండలిలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ

హైదరాబాద్: శాసన మండలిలో విద్యుత్ సవరణ బిల్లు - పర్యవసానాలపై లఘు చర్చ ప్రారంభం అయింది. ఎమ్మెల్సీ మధుసూదనాచారి చర్చను ప్రారంభిస్తూ ఒకప్పుడు కరెంటు కనెక్షన్ కోసం పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. 1935లో తెలంగాణలో పవర్ ప్లాంట్ స్థాపించారని.. అప్పుడు 7,778 మెగావాట్లు ఉంటే,  ఇప్పుడు 17,665 మెగావాట్లు అయ్యింది..  తెలంగాణలో ఎనిమిదేళ్లలో 10 వేల మెగావాట్ల కెపాసిటీ పెంచుకున్నామని తెలిపారు. దేశ తలసరి వినియోగం కంటే తెలంగాణ వినియోగం ఎక్కువ. డబుల్ ఇంజన్ గ్రోత్ అని చెప్పుకునే పెద్ద మనుషుల యూపీలో 665 యూనిట్లు మాత్రమే ఉంటే.. తెలంగాణలో 1156 యూనిట్లకు పెంచుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 5600 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉండేది.. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల 14,060 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు అయ్యిందని ఎమ్మెల్సీ మధుసూధనాచారి తెలిపారు. 

అభివృద్ధి సూచికలో మొదటిదైన విద్యుత్ పరిస్థితి దేశంలో దయనీయంగా ఉందని, తెలంగాణకు సహకరించకుండా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం దేశంలో దుర్మార్గపు సంస్కరణలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల పేరుతో ఇంకా దేశాన్ని దిగజార్చవద్దని.. విద్యుత్ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ మధుసూధనాచారి డిమాండ్ చేశారు.