తెలంగాణలో సమ్మెబాట పట్టిన కరెంట్ మీటర్ రీడర్లు

తెలంగాణలో సమ్మెబాట పట్టిన కరెంట్ మీటర్ రీడర్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలోని కరెంటు మీటర్‌‌‌‌‌‌‌‌ రీడర్లు గురువారం నుంచి సమ్మె బాటపట్టారు. తమకు నెలంతా పని కల్పించి, ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 22 ఏండ్లుగా తమ సమస్యల్ని అధికారులు పట్టించుకోవట్లేదనీ, గత్యంతరం లేకే సమ్మెకి వెళ్లాల్సి వచ్చిందని విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్  ప్రధాన కార్యదర్శి చిరంజీవి గురువారం వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల 200 మంది పనిచేస్తున్నారని.. వారికి పీఎఫ్ సొమ్మును కూడా కాంట్రాక్టర్లు సక్రమంగా చెల్లించట్లేదని తెలిపారు. అనేక పోరాటాల తర్వాతే తమకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు.

కరెంట్ మీటర్ రీడర్లు సమ్మెకు దిగటంతో.. ఫిబ్రవరి నెల కరెంట్ బిల్లులు వస్తాయో లేదో అనే ఆందోళన కస్టమర్లలో ఉంది. ఒక వేళ ఫిబ్రవరి నెల కరెంట్ బిల్లులు లేకుండా.. మార్చి నెలలో ఇచ్చినట్లయితే.. రెండు నెలలకు ఒకే బిల్లు వస్తే.. స్లాబ్ రేటు మారి కరెంట్ ఛార్జీలు పెరుగుతాయనే భయం కస్టమర్లలో ఉంది.

Also Read : తెలంగాణలో సమ్మెబాట పట్టిన కరెంట్ మీటర్ రీడర్లు