రైతన్నకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు

రైతన్నకు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు

వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు తరచూగా చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 నుంచి 12 గంటల పాటు మాత్రమే సప్లయ్ చేస్తుండడం రైతులు అవస్థలు పడుతున్నారు. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్ తగ్గడంతో పారిన మడే మళ్లీమళ్లీ పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది రైతులు బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లాలో 4.80 లక్షల ఎకరాల పంటలు సాగు కాగా ఇందులో 2,86,100 ఎకరాల్లో వరి వేశారు.  దాదాపు 2 లక్షల ఎకరాల వరకు బోరు బావుల కిందనే సాగైంది. 96 వేల అగ్రికల్చర్​ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్షన్లు ఉన్నాయి.  నెల రోజుల కింద భారీ వానలు కురిశాయి. ఆ తర్వాత కొద్ది రోజులుగా  వర్షాల జాడ లేదు. 4 రోజుల కింద జిల్లాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. పంటలు కీలక దశలో ఉన్నప్పుడు  వానలు ముఖం చాటేయడం, ఎండలు పెరగడంతో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి పంటకు సరిపడా నీళ్లు అందక అక్కడక్కడ పొలాలు బీటలు వారుతున్నాయి.  

బోర్లలో నీరున్నా..
గతంలో ఆశించిన వానలు లేక బోరుబావుల్లో నీటి ధారలు తక్కువగా వచ్చేవి. ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే భారీ వర్షాలు కురియడంతో భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం బోర్లలో సమృద్ధిగా నీళ్లు వస్తున్నప్పటికీ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అంతరాయం కలుగుతుందని రైతులు పేర్కొన్నారు. 

ప్రస్తుత పరిస్థితి ఇది..
జిల్లాలో కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లయ్  ఒక్కో ఏరియాలో ఒక్కో టైంలో జరుగుతోంది. 10 నుంచి 12 గంటల పాటు సప్లయ్ అవుతోంది. కానీ ఆఫీసర్లు మాత్రం 12 గంటల పాటు సప్లయ్​ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని ఏరియాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి , ఇంకొన్ని ఏరియాల్లో ఉదయం 6 గంటల నుంచి సప్లయ్ ఉంటుంది. పైకి కూడా 12 గంటల పాటు సప్లయ్​చేస్తున్నామని చెబుతున్నప్పటికీ  చాలా ఏరియాల్లో 10 గంటలకు మించి రావట్లేదని రైతులు తెలిపారు. ఈ సప్లయ్​ టైంలో కూడా చాలా సార్లు  మధ్యమధ్యలో నిలిచి పోతుంది. లైన్ రిపేర్ పేరిట కొన్ని సార్లు, పై నుంచి సప్లయ్​ఆగిపోయిందని, పలు కారణాలు చూపుతూ  ఒంటి గంట నుంచి 2 గంటల వరకు సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిలిపి వేస్తున్నారు. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పారిన మడినే మళ్లీ పారించాల్సి వస్తోంది. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో వరి మళ్లలో నీళ్లు నిల్వ ఉండడం లేదు. దోమకొండ, బీబీపేట, సదాశివనగర్​, రామారెడ్డి, రాజంపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో పొలాలకు నీళ్లు సరిగ్గా పారడం లేదు. కొన్ని చోట్ల పొలం మడులు నీళ్లు లేక బీటలు వారుతున్నాయి. 

నాలుగైదుసార్లు పోతోంది
నేను రెండున్నర ఎకరాల వరి పంట వేసినా.  కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొద్దుగాల 7 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకు పోతుంది. ఈ మధ్యల కూడా నాలుగైదు సార్లు పోతది.. వస్తది. కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాగా తిప్పలవుతుంది.- అబ్రపోయిన పోశయ్య, ఎల్లారెడ్డిపల్లి

24 గంటలు అన్నరు కానీ..
అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 24 గంటల పాటు కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తామన్నారు. కానీ ఈ వానాకాలంలో 10 నుంచి 12 గంటల పాటే ఇస్తున్నరు. మధ్యలో సప్లయ్​అగిపోతుంది. అడిగితే రిపేర్ కోసం ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ తీసుకున్నమని చెబుతున్నరు. పొద్దంతా పొలం దగ్గరే ఉండాల్సి వస్తోంది. - మార్గం శ్రీను, శెట్పల్లి సంగారెడ్డి