ఎలక్ట్రానిక్ షాప్ చోరీ నిందితుల రిమాండ్ : సీఐ శ్రీధర్ రెడ్డి

ఎలక్ట్రానిక్ షాప్ చోరీ నిందితుల రిమాండ్ : సీఐ శ్రీధర్ రెడ్డి

బాల్కొండ, వెలుగు : మండల కేంద్రంలో హరిహర ఎలక్ట్రానిక్ షాపులో జరిగిన చోరీ నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు అర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాల్కొండ సర్కిల్ ఆఫీస్ లో ఎస్సై శైలేందర్ తో కలిసి వివరాలను వెల్లడించారు. ఈ నెల18న షాప్ ఓనర్ నిఖిల్ తాళం వేసి వెళ్లి తిరిగి మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి షెడ్డు వెనుక భాగం ధ్వంసమైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. 

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సుంకేట్ తేజ, మీసాల అజయ్ గా గుర్తించారు.నిందితులను విచారించగా నేరం ఒప్పుకున్నారు. మెండోరా మండలం సోన్ పేట్ కు చెందిన అజయ్ తన బైక్ పై వచ్చిన తేజ అందిన కాడికి టీవీలు, రైస్ కుక్కర్, గ్రైండర్లు, ఫ్యాన్లు, కలిపి 11 వస్తువులు చోరీ చేశారు.  బైక్,  చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. అయితే సుంకేట తేజ తరుచూ చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. గతంలో బాల్కొండ బైపాస్ లో ఉన్న ఈ కామ్ ఎస్ప్రెస్ లో చోరీకి పాల్పడ్డాడని తెలిపారు.