ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎస్ఏపీ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న అభ్యర్థులు వాక్- ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. జనవరి 28, 29వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఖాళీలు: 15.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ ఆఫీసర్ 10 (ఎఫ్ఐసీఓ 02, పీఎస్/ పీపీ 01, ఎంఎం 01, ఏబీఏపీ 02, పీపీ/ పీఎం/ క్యూఎం 01, బేసిక్ 01, ఎస్డీ 01, హెచ్సీఎం/ పేరోల్ 01).
ఎస్ఏపీ స్పెషలిస్ట్ 05 (ఎఫ్ఐ 01, ఎంఎం 01, పీఎస్, పీపీ & క్యూఎం 01, ఏబీఏపీ, వెబ్‌డైనప్రో & వర్క్ ఫ్లో 01, జనరల్ 01).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్ఏపీలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: జనవరి 28, 29.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.ecil.co.in వెబ్సైట్ను సందర్శించండి.
