వీడియో రికార్డు చేస్తుండగా.. ఏనుగు తొక్కి చంపేసింది

వీడియో రికార్డు చేస్తుండగా.. ఏనుగు తొక్కి చంపేసింది

అడవి జంతువులతో ఎంత ప్రమాదమో చూడండి.. ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా అవి దాడి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తాయి..ఏనుగులను తరిమేద్దామని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు ఓ అటవీశాఖ ఉద్యోగి.. గ్రామాల్లోకి వచ్చిన ఏనుగులను తరిమి కొట్టే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది ఒకరు ఒకరు మృత్యువాత పడ్డారు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా మీద పడటంతో తప్పించుకునే క్రమంలో కిందపడి  మృతిచెందాడు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా పలాస్ గావ్ అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో సుధాకర్ అనే అటవీ శాఖ సిబ్బంది మృతిచెందాడు. ఏనుగుల గుంపును తరిమి కొట్టేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తుండగా.. సిబ్బందిలో ఒకరైన సుధాకర్ ను ఏనుగు తొక్కి చంపేసింది. మృతుడు అటవీ శాఖలో డ్రైవర్గా పనిచేస్తున్న సుధాకర్గా గుర్తించారు. 

ఆదివారం అడవి ఏనుగులు పలాస్ గావ్ అడవుల్లోకి ప్రవేశించాయని గ్రామస్తులు అటవీశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీశాఖ సిబ్బంది ఏనుగులను తరిమికొట్టేందుకు పలాస్ గావ్ లో ఏనుగులున్న ప్రాంతానికి వెళ్లారు. ఏనుగులను వెళ్లగొట్టే క్రమంలో సుధాకర్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఏనుగుల గుంపు ఒక్కసారిగా అటవీశాఖ సిబ్బందిపైకి దూసుకు రావడంతో సిబ్బంది పరుగులు పెట్టారు..ఈ క్రమంలో సుధాకర్ కిందపడ్డాడు.. దీంతో ఓ ఏనుగు సుధాకర్ ను తొక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
 
గత కొంత కాలంగా ఒడిశా అడవులనుంచి మహారాష్ట్రలోని గ్రామాల్లో ప్రవేశించి పంటలను తీవ్ర నష్టం కలిగిస్తు్న్నాయి. రెండు నెలల క్రితం ఓ వృద్ధుడిని ఏనుగులు చంపేశాయి. మరికొందరిని తీవ్రంగా గాయపర్చాయి. ఈ క్రమంలో ఏనుగులు గ్రామాలపై పడి నష్టం కలిగించకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. అడవి ఏనుగుల దగ్గరకు ప్రజలను వెళ్లొద్దని హెచ్చరిస్తోంది.