మార్కెట్ లోకి ఎలిమ్ ప్రొడక్ట్స్

మార్కెట్ లోకి ఎలిమ్ ప్రొడక్ట్స్

బషీర్​బాగ్, వెలుగు: పర్యావరణ అనుకూల ఉత్పత్తులను మార్కెట్‌‌లోకి తీసుకొచ్చినట్లు ఎలిమ్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పీవీ కృష్ణ తెలిపారు. రెడ్ హిల్స్‌‌లో ఆదివారం జరిగిన ప్రీలాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

అందమైన ఇంటిని నిర్మించడానికి కోట్లు ఖర్చు చేస్తామని, కానీ శుభ్రత, పరిశుభ్రత విషయంలో తగిన శ్రద్ధ చూపకపోవడం వల్ల కుటుంబ ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. బాత్రూమ్, ఫ్లోర్‌‌లను శుభ్రంగా ఉంచడం ద్వారా 50 నుంచి 60 శాతం వరకు ఆరోగ్యంగా ఉంటామన్నారు. అలాంటి ఆర్యోగాన్ని అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు.