జీపీ కార్మికుల జీతాలు చెల్లించాలి : ఎల్లయ్య

జీపీ కార్మికుల జీతాలు చెల్లించాలి : ఎల్లయ్య

జగదేవపూర్, వెలుగు: పెండింగ్ లో ఉన్న జీపీ కార్మికుల జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్‌‌‌‌ చేశారు. మంగళవారం జగదేవపూర్ లోని ఎంపీడీవో ఆఫీసులో ఎంపీడీవో యాదగిరికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీపీ కార్మికుల జీతాలు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్నారు.

రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులు జీతాలు రాక పస్తులుండే దుస్థితి దాపురించిందన్నారు. ప్రతినిత్యం మురికితో సహవాసం చేసే జీపీ కార్మికుల జీతాలను పెండింగ్ లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చాట్లపల్లి యాదగిరి, నాగరాజు, కనకవ్వ, కార్మికులు పాల్గొన్నారు.