త్వరలో ప్రపంచ యుద్దం వస్తుంది..! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

త్వరలో ప్రపంచ యుద్దం వస్తుంది..! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మరో ఐదు పదేళ్లలో ప్రపంచ యుద్దం జరగొచ్చని జోస్యం చెప్పారు. ఎందుకు యుద్దం వస్తుంది ఎలా వస్తుంది అనే అంశాలపై స్పష్టత లేకుండా ఓ పోస్ట్ లో తన అభిప్రాయాన్ని చెప్పడం ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. 5 నుంచి 10 ఏళ్లలో  యుద్దం అనివార్యం అన్నారు. 2030నాటికి యుద్దం ప్రారంభమవుతుందని అంచనా వేశారు. ప్రపంచ పాలన..అణు నిరోధకత ప్రభావంపై ఓయూజర్  పోస్ట్‌కు టెస్లా CEO సమాధానం ఇస్తూ  ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం, ట్రంప్ టీంట్ కీరోల్ పోషించిన వ్యక్తి ఎలాన్ మస్క్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నిజంగానే ప్రపంచ యుద్దం వస్తుందా అని గందరగోళంలో పడ్డారు. ఇది నిజమేనా అని ఎలాన్ మస్క్ AI  ఫ్లాట్ ఫాం Grok లో వెతకడం ప్రారంభించారు.

►ALSO READ | ఇమ్రాన్ ఖాన్ బతికే ఉండు.. మరణ పుకార్లకు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ 

నెటిజన్ల ప్రశ్నలకు Grok స్పందిస్తూ.. అయితే ఎలాన్ మస్క్ తన పోస్టులో ఎలాంటి  వివరణ పెట్టలేదని సమాధానం ఇచ్చింది. అయితే గతంలో దీనికి సంబంధించి కొన్ని సాక్ష్యాలను చూపించారు ఎలాన్ మస్క్..వలసలు, ఉనికిని చాటుకొని రాజకీయాలు, యూరప్ , యూకే లలో అంతర్యుద్దాలు, తైవాన్ పై అమెరికా , చైనా సంఘర్షణలు, రష్యా, ఉక్రెయిన్ యుద్దం వంటివి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే అవకాశం ఉందని గతంలోనే ఎలాన్ మస్క్ హైలైట్ చేశారని గ్రోక్ తెలిపింది.