ట్విట్టర్ 2.0 కొత్త యాప్ ని తీసుకొస్తున్న మస్క్

ట్విట్టర్ 2.0 కొత్త యాప్ ని తీసుకొస్తున్న మస్క్

ట్విట్టర్ అధినేత అందరికీ ‘విలన్’ మస్క్ లా తయారయ్యారు. ట్విట్టర్ ని కొనుగోలు చేయడం ఏంటో కానీ, రోజుకొక కొత్త మార్పు తీసుకొస్తున్నారు. ట్విట్టర్ ని పూర్తిగా గాడిలో పెట్టకుముందే కొత్తగా ట్విట్టర్ 2.0 ది ఎవ్రీ థింగ్ యాప్ ని తీసుకురాబోతున్నారు. ట్విట్టర్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ని తయారు చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వార్త బిజినెస్ ఇన్ సైడర్ లో ప్రచురితమైంది.

అయితే ఈ నిర్ణయంపై ట్విట్టర్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ను పట్టించుకోకుండా కొత్త యాప్ ని తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లు, కుర్చీలను అమ్మేస్తున్నారట. ఆఫీస్ కు వచ్చిన గెస్ట్ లను వేయిట్ చేయిస్తూ, యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. స్టాఫ్ ను ఇంటికి వెళ్లనివ్వకుండా ఆఫీస్ లోనే రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.