
- ‘వన్ బిగ్.. బ్యూటిఫుల్ బిల్’ను వ్యతిరేకించిన మస్క్
- అమెరికాను అప్పుల్లోకి నెడ్తుందంటూ బహిరంగ విమర్శలు
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)’ బాధ్యతల నుంచి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తప్పుకున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాన్ మస్క్.. స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా పని చేశారు. తాజాగా ట్రంప్ సిగ్నేచర్ బిల్ అయిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు అమెరికాను అప్పుల ఊబిలోకి నెడ్తుందని విమర్శించారు. ఈ కారణంగానే ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరిగింది.
అదేవిధంగా, ట్రంప్ చైనాపై 145 శాతం, కెనడా, మెక్సికోపై 25 శాతం టారిఫ్ విధించడం కూడా మస్క్‌కు నచ్చలేదు. చైనాలో టెస్లాకు మంచి మార్కెట్ ఉంది. టారిఫ్ కారణంగా వ్యాపారం చాలా దెబ్బతిన్నది. టెస్లా ఎక్స్‌పోర్ట్స్ పడిపోయాయి. 2025లో టెస్లా లాభాలు 71 శాతం తగ్గాయి. అయితే, తన కంపెనీలపై తిరిగి ఫోకస్ పెట్టేందుకే మస్క్ డోజ్ నుంచి తప్పుకున్నారని ట్రంప్ చెప్తుండటం గమనార్హం.