Starship Crash: ఎలాన్ మస్క్ మెగా రాకెట్ ఫెయిల్.. గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్

Starship Crash: ఎలాన్ మస్క్ మెగా రాకెట్ ఫెయిల్.. గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్షిప్

ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రయోగించిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ గాల్లోనే పేలిపోయింది. ఇలా జరగడం ఇది మూడో సారి. ప్రయోగించిన కొంతసేపటికే స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ అదుపు తప్పింది. దీంతో.. స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు స్టార్ షిప్పై నియంత్రణ కోల్పోయారు. కాసేపటికే.. హిందూ మహా సముద్రంలో స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ నిప్పులు కక్కుతూ కూలిపోయింది. భారీ శబ్దాలతో ముక్కలు ముక్కలైంది. ఆకాశంలో మంటలు చెలరేగి తునాతునకలుగా భూమిపై పడిపోవడం చూసి స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు భయాందోళన చెందారు.

ఎంతో పవర్ ఫుల్ రాకెట్ సిస్టమ్ను డెవలప్ చేయాలని భావిస్తున్న ఎలన్ మస్క్కు ఈ ప్రయోగం విఫలం కావడంతో మరోమారు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. టెక్సాస్ లోని స్టార్ బేస్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. మార్స్ రాకెట్ ప్రోగ్రామ్లో భాగంగా ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగాలు చేస్తోంది. వంద మిలియన్‌‌ డాలర్ల పెట్టుబడితో 2002 మే నెలలో ‘స్పేస్‌‌ ఎక్స్‌‌’ కంపెనీ పెట్టాడు. కాలిఫోర్నియాలోని ఎల్ సెగుండోలో 75,000 చదరపు అడుగుల స్థలంలో కంపెనీ ప్రారంభమైంది.

స్టార్ షిప్ ఎలాన్‌‌ మస్క్ డ్రీమ్‌‌ ప్రాజెక్ట్‌. అంగారక గ్రహంపై ల్యాండింగ్ అనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే.. అంగారక గ్రహం చాలా దూరంగా ఉంది. అందువల్ల అక్కడికి వెళ్లేముందు రెండోసారి ఫ్యుయెల్‌‌ని నింపుకోవాల్సి వస్తుంది. అదే ఈ ప్రాజెక్ట్‌‌కు పెద్ద సమస్య. అయితే.. రెండు రాకెట్లను ప్రయోగించడమే దీనికి పరిష్కారం. వాటిలో ఒకటి మరొకదానికి ఇంధనాన్ని తీసుకెళ్తుంది. 2023 ఏప్రిల్ 20న స్టార్‌‌షిప్ టెస్ట్ లాంచ్ చేశారు. కానీ.. అది నింగిలోకి ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది.

బూస్టర్ వేరవటానికి ప్రయత్నించినప్పుడు రాకెట్ వ్యవస్థలు విఫలమయ్యాయి. దీంతో స్టార్‌‌షిప్ పేలిపోయింది. లాంచ్ చేసిన 75 సెకన్ల తర్వాత స్టార్‌‌షిప్ కెమెరా నుంచి ఫొటోలు రిలీజ్​ అయ్యాయి. ఆ ఫొటోల్లో 33 ఇంజిన్‌‌లలో 27 ఇంజిన్లలో మాత్రమే లైట్లు వెలగడం కనిపించింది. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి స్టార్‌‌షిప్ బాటలు వేస్తుందని స్పేస్ ఎక్స్ చెప్తోంది. కానీ.. స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ ప్రయోగం ఇప్పటికీ విఫలయత్నంగానే మిగిలిపోయింది.