AIతో అన్ని ఉద్యోగాలు పోతాయి..కానీ..: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్

AIతో అన్ని ఉద్యోగాలు పోతాయి..కానీ..: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై టెస్లా సీఈవో, X సోషల్ మీడియా ప్లాట్ ఫాం అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ తో అన్ని రంగాల్లో ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని..రాబోయే రోజుల్లో AI తో పనిచేసే రోబోట్ ల కాలం వస్తుందని అన్నారు. ఇవి మనుషులు చేసే ప్రతి పనిని చేస్తాయన్నారు.

‘వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలను తొలగిస్తుందని..అయితే AI డెవలప్ మెంట్ తో చెడు తప్పనిసరిగా ఉండకపోవచ్చని’ అన్నారు. 

AI రోల్, సమస్యలపై మస్క్ ఎమన్నారంటే.. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్యాన్వేషణ,మానవాళిప్రయోజనం చేకూర్చేలా ఉండాల్సిన అవసరం ఉందని మస్క్ నొక్కిచెప్పారు. ప్రధాన AI ప్రోగ్రామ్ లు సత్యాన్ని వెతకడం కంటే పొలిటికల్ కరెక్ట్ నెస్ పొందడం ఆందోళనకరంగా ఉందన్నారు. 

AI  నా అతిపెద్ద భయం : మస్క్ 

స్టార్టప్ వైవా టెక్ ఈవెంట్ లో ఎలాన్ మస్క్ ఏఐపై ఆందోళన వ్యక్తం చేశారు. AI పై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు కొత్తేమి కావు. ఇంతకుముందు వేగంగా పెరుగుతున్న AI గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఇది లేటెస్ట్ టెక్నాలజీతో సమాజంపై ఆధిపత్యానికి అవకాశం ఉందంటూ గతంలో చెప్పాడు.