Elon musk : ఆ ట్వీట్లను రికమెండ్ చేస్తం : మస్క్‌

Elon musk : ఆ ట్వీట్లను రికమెండ్ చేస్తం : మస్క్‌

ఎలన్ మస్క్‌ ట్విట్టర్‌‌ని కొనుగోలు చేసిన తర్వాత చాలా రకాల మార్పులు తీసుకొచ్చాడు. ట్విట్టర్ బ్లూ, బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్, లేఆఫ్స్ అంటూ చాలా మార్పులు చేశాడు. తాజాగా మరో కొత్త అప్‌డేట్ తెస్తున్నట్లు మస్క్ ట్వీట్‌ చేశారు. ట్వీట్లను అనువాదించడంతో పాటు ముఖ్యమైన ట్వీట్లను రికమెండ్ చేయనున్నట్లు చెప్పాడు. 

‘ట్విట్టర్‌‌లో రాజకీయమే కాదు.. ముఖ్యమైన పోస్ట్‌లు కూడా ట్వీట్ చేస్తుంటారు. వాళ్ల దేశాల్లో జరుపుకునే పండుగలు, సంస్కృతుల గురించి ఎన్నో ట్వీట్లు పెడుతుంటారు. వాటన్నింటిని ఇకపై ట్విట్టర్ ట్రాన్స్‌లేట్ చేస్తుంది. వాటిని రికమెండ్‌ చేసి (మొదట కనిపించేలా చేసి) ప్రపంచానికి చూపిస్తుంది. దీనివల్ల ఆయా దేశాల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలుస్తాయ’ని మస్క్ ట్వీట్ తెలిపాడు.