ట్విట్టర్ కొత్త లోగోపై ఎలాన్ మస్క్ అప్ డేట్.. వీడియో రిలీజ్

ట్విట్టర్ కొత్త లోగోపై ఎలాన్ మస్క్ అప్ డేట్.. వీడియో రిలీజ్

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త లోగోను ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. కొత్త లోగో "X" ఐకానిక్ బ్లూ బర్డ్ చిహ్నాన్ని భర్తీ చేయనుందని ఇంతకుముందే ప్రకటించిన ఆయన.. రీసెంట్ ఈ లోగోకు సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ లోగో వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. గత సంవత్సరం 44 బిలియన్ల డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన టెస్లా CEO ఎలాన్ మస్క్.. ఇప్పటివరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పుల్లో ఇదే పెద్దది అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా మస్క్ తన ప్రొఫైల్‌లో కొత్త ట్విట్టర్ లోగోగా ఉండే వీడియోను పిన్ చేశాడు. మరో ట్వీట్‌లో అదే లోగోను టెక్స్ట్ రూపంలో పోస్ట్ చేశాడు.

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను “X” అని పిలుస్తామని ట్విట్టర్ CEO లిండా యాకారినో కూడా ధృవీకరించారు. AI- పవర్డ్ ప్లాట్‌ఫారమ్ ఆడియో, వీడియో, మెసేజింగ్, చెల్లింపుల చుట్టూ ఇది కేంద్రీకృతమై ఉందని వరుస ట్వీట్‌లలో యాకారినో చెప్పారు. "ఇది అసాధారణమైన అరుదైన విషయం. జీవితంలో లేదా వ్యాపారంలో మరొక పెద్ద అడుగు వేయడానికి మీకు ఇది రెండో అవకాశం" అని ఆమె ట్వీట్ చేశారు. "ట్విట్టర్ ఒక భారీ ఇంప్రెషన్ కు మారింది. ఇది కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చింది. ఇప్పుడు, X మరింత ముందుకు వెళ్తుంది. గ్లోబల్ టౌన్ స్క్వేర్‌ను మారుస్తుంది' అని ఆమె ట్వీట్ ద్వారా చెప్పారు.

pic.twitter.com/IwcbqMnQtA

— Elon Musk (@elonmusk) July 23, 2023

"ఇది అసాధారణమైన అరుదైన విషయం - జీవితంలో లేదా వ్యాపారంలో - మరొక పెద్ద ముద్ర వేయడానికి మీకు రెండవ అవకాశం లభిస్తుంది" అని చీఫ్ ట్వీట్ చేశారు. "ట్విట్టర్ ఒక భారీ ముద్ర వేసింది మరియు మేము కమ్యూనికేట్ చేసే విధానాన్ని మార్చింది. ఇప్పుడు, X మరింత ముందుకు వెళ్తుంది, గ్లోబల్ టౌన్ స్క్వేర్‌ను మారుస్తుంది' అని ఆమె చెప్పారు.

మరో ట్వీట్‌లో, గత ఎనిమిది నెలల్లో X రూపాన్ని మేము ఇప్పటికే చూశాము. X అనేది ప్రతిదానిని బట్వాడా చేయగల ప్లాట్‌ఫారమ్‌గా ఉంటుందని ఆమె అన్నారు. "మా వేగవంతమైన ఫీచర్ లాంచ్‌ల ద్వారా గత 8 నెలలుగా X రూపాన్ని పొందడం మేము ఇప్పటికే ప్రారంభించాము, కానీ మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాము" అని ఆమె చెప్పారు.

'X.com' ఇప్పుడు యూజర్స్ ను మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌కి తీసుకువెళ్తుందని కూడా మస్క్ ఈ సందర్భంగా చెప్పారు. అంతకుముందు ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ సైట్‌ను రీబ్రాండ్ చేయడంపై మస్క్ కీలక ట్వీట్లు చేశారు. "త్వరలోనే మేము ట్విట్టర్ బ్రాండ్‌ అయిన అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతాము" అని మస్క్ ఒక ట్వీట్‌లో రాశారు.

 

It’s an exceptionally rare thing – in life or in business – that you get a second chance to make another big impression. Twitter made one massive impression and changed the way we communicate. Now, X will go further, transforming the global town square.

— Linda Yaccarino (@lindayacc) July 23, 2023