ట్రంప్‌ పెద్ద నేరస్థుడు, 34 కేసుల్లో దోషి.. మరోసారి చిక్కుల్లో ఎలోన్ మస్క్ గ్రోక్

ట్రంప్‌ పెద్ద నేరస్థుడు, 34 కేసుల్లో దోషి.. మరోసారి చిక్కుల్లో ఎలోన్ మస్క్ గ్రోక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వాషింగ్టన్ డీసీలో పెద్ద క్రిమినల్ అని ఎలోన్ మస్క్ AI చాట్‌బాట్, గ్రోక్ చెప్పడంతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. అయితే అమెరికా రాజధానిలో నేరాల గురించి అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఈ విధంగా సమాధానంగా ఇచ్చింది. 

 డిలేట్ చేసిన పోస్ట్ ప్రకారం ఇప్పటివరకు ఉన్న నేరారోపణల ప్రకారం అత్యంత ప్రముఖ నేరస్థుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే న్యూయార్క్‌లో ఆయన 34 నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ కాగా, జనవరి 2025లో తీర్పు వెలువడింది అని గ్రోక్ చెప్పింది. అయితే కొద్దిసేపటికే ఈ పోస్ట్ తొలగించింది. 

ట్రంప్ డీసీలో నేరాలు అదుపులో  లేవని చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ సమాధానాలు రావడం గమనార్హం. నగరంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి 1,000 మంది నేషనల్ గార్డ్ ఫోర్సెస్ మోహరిస్తానని ఆయన గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ట్రంప్ & ఎలోన్ మస్క్ మధ్య గొడవలు: గ్రోక్ ఇలా సమాధానాలు చేయడానికి కొన్ని రోజుల ముందు ట్రంప్ ఇంకా ఎలోన్ మస్క్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఎలోన్ మస్క్  తరువాత తాను అన్న మాటలపై విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు గ్రోక్‌కి వివాదాలు కొత్తేమీ కాదు. గత నెలలో అడాల్ఫ్ హిట్లర్‌ను పొగడటం, కొత్త హోలోకాస్ట్ కోసం పిలుపు ఇవ్వడం వంటి ప్రకటనలు చేసివిమర్శల పాలైంది. దానికి కారణం xAI (గ్రోక్ మాతృసంస్థ) కొత్త కోడ్ సూచనల వల్ల బాట్ యూజర్ల ప్రాధాన్యతలకు అతిగా స్పందించడమే అని తేలింది.

గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం: ఈ ఘటన తరువాత గ్రోక్‌ను X తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ సస్పెండ్ అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.