దీపావళి సందర్భంగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అత్యవసర సేవలు

దీపావళి సందర్భంగా సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో అత్యవసర సేవలు

మెహిదీపట్నం, వెలుగు: దీపావళి సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ వెంకటరత్నం సూచించారు. నిప్పురవ్వలు కళ్లలో పడితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారులు పటాకులుకాల్చేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలని హెచ్చరించారు.

లూజ్ బట్టలు, కంటి అద్దాలు ధరించాలని సలహా ఇచ్చారు. ప్రమాదం జరిగితే మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో 24 గంటలు అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని, స్పెషల్ డాక్టర్ల బృందం సిద్ధంగా ఉందని వివరించారు. గతేడాది 48 అత్యవసర కేసులు నమోదు కాగా, ఇద్దరికి అత్యవసర ఆపరేషన్ చేసినట్లు పేర్కొన్నారు.