ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటాడు: ఫ్రెంచ్ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు

ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటాడు: ఫ్రెంచ్ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు

వాషింగ్టన్: కెనడాలో జరుగుతోన్న జీ-7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ముందుగానే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఉన్నఫళంగా వెళ్లిపోవడానికి కారణమేంటన్న దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ గురించి చర్చించేందుకే ట్రంప్ జీ-7 మీటింగ్ నుంచి ఆకస్మాత్తుగా వెళ్లిపోయారని  ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‎ చెప్పారు. ఇమాన్యుయేల్ మాక్రాన్ చెప్పిన విషయాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. 

నేను జీ7 సదస్సు నుంచి తొందరగా వెళ్లిపోవడానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గురించి చర్చించడానికి కాదని.. వేరే పని మీద త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. కాల్పుల విరమణతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకునే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ప్రతి విషయాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటాడని విమర్శించారు.

►ALSO READ | ఇరాన్లో ఉండొద్దు.. తిరిగొచ్చేయండి.. సేఫ్ జోన్లోకి 110 మంది ఇండియన్ స్టూడెంట్స్

నేను వెళ్లిపోవడానికి అసలు కారణమేంటో అతడికి తెలియదు.. నేను వెళ్లడానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గురించి చర్చించడానికి కాదు.. అంతకంటే పెద్ద పని మీద వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చాడు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సంక్షోభం వల్లే జీ7 సమ్మిట్ నుంచి ట్రంప్ త్వరగా తిరిగి రావడానికి కారణమని వైట్ హౌస్ వెల్లడించింది.