పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. సూర్య జి యాదవ్ దర్శకుడు. మేఘన హీరోయిన్. శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ మూవీ ఆడియోను విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ‘పెద్దపల్లి రోహిత్ కంపోజ్ చేసిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ బాగుంది. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది. పార్థ గోపాల్ తను సినిమా తాను నిర్మించుకునే స్థాయి నుంచి మరో నిర్మాత తనపై పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు.
‘ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని హీరో పార్థ గోపాల్ చెప్పాడు. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిందని దర్శకుడు చెప్పాడు. హీరోయిన్ మేఘన, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు. ఇక ఈ చిత్రంలోని ‘మరదలివే’ అనే పాటకు హుక్ స్టెప్స్‌తో రీల్స్ చేసిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా యాభై వేలు ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
