
దీపావళి పండుగ వచ్చిదంటే చాలు.. ఎంప్లాయీస్ గిప్ట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు యాజమాన్యాలు కూడా బహుమతులు ఇస్తుంటాయి.. స్వీట్ బాక్స్‌లు.. డ్రై ఫ్రూట్స్.. ఇలా కంపెనీ యాజమాన్యం నిర్దేశించి ఫెస్టివల్ గిప్ట్స్ ఇస్తాయి. అయితే ఇవి కొంతమందికి నచ్చొచ్చు.. మరికొంత మందికి నచ్చకపోవచ్చు.. దీపావళి పండుగకు ఉద్యోగులు ఎలాంటి బహుమతులు కోరుకుంటున్నారో ఓ సంస్థ సర్వే చేసింది.
దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి స్వీట్స్, గిఫ్ట్, ఉద్యోగుల కోసం కంపెనీలు కూడా స్వీట్ బాక్సులు, డ్రై ఫ్రూట్ గిఫ్ట్ గా ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల ఆలోచనా ధోరణి మారిపోయింది. కంపెనీలు ఇచ్చే ఆ డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ను బహుమతులు అనుకోవడం లేదంట ఎంప్లాయిస్. దీపావళికి ఉద్యోగులు ఎలాంటి గిఫ్ట్ కోరుకుంటారనే అంశంపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది.
ఈ సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది ఎంప్లాయిస్... స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ బహుమతులుగా అవసరం లేదని చెప్పారు. తొమ్మిది శాతం మంది తమకు వచ్చే దీపావళి గిఫ్ట్ నచ్చకపోవడం, ఉపయోగం లేకపోవడంతో మరొకరికి ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది ఉద్యోగులు తమ కంపెనీ నుంచి ఆన్ లైన్ గిఫ్ట్ కార్డును దీపావళి బహుమతిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
32 శాతం మంది మాత్రం క్యాష్ బోనస్, 11 శాతం మంది గృహోపకరణాలు, 6 శాతం మంది రెస్టారెంట్ వోచర్లను దీపావళి గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం 5 శాతం మంది మాత్రమే తాము స్వీట్స్.. డ్రై ఫ్రూట్స్ ను గిఫ్ట్ కోరుకుంటున్నామన్నారు.. ఉద్యోగులకు ఏదో ఒక గిఫ్ట్‌ను రుద్దేయకుండా వారి అభిరుచికి తగ్గట్టు బహుమతులు ఇవ్వాలని సర్వే చేసిన సంస్థ సూచించింది.