ఎన్​పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట ఆర్జిజన్​కార్మికులు ధర్నా

ఎన్​పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట ఆర్జిజన్​కార్మికులు ధర్నా

ఆదిలాబాద్/కోల్​బెల్ట్/ఆసిఫాబాద్/నిర్మల్,వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం వివిధ శాఖల ఉద్యోగులు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల ఎన్​పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట ఆర్జిజన్​కార్మికులు ధర్నా చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ఆసిఫాబాద్, నిర్మల్ డీఎంహెచ్​వో ఆఫీస్​ల ముందు సెకండ్​ ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు.​ క్యాతన్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపూర్​లో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్​ లీడర్లు, కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్​ను పర్మినెంట్​చేయాలని ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.

మంచినీటి సమస్య పరిష్కరించాలి...

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపూర్​లో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాంగ్రెస్​ లీడర్లు డిమాండ్​ చేశారు. కాలనీ వాసులతో కలిసి మున్సిపల్​ఆఫీస్​ఎదుట ధర్నా చేశారు. పది రోజులుగా మిషన్​ భగీరథ నీళ్లు వస్తలేవని, బోర్​వెల్స్ ​పని చేయడం లేదన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్​ కీర్తి నాగరాజుకు వినతిపత్రం అందించారు. నిరసనలో పార్టీ టౌన్​ ప్రెసిడెంట్​ పల్లె రాజు, బ్లాక్​ప్రెసిడెంట్​ గోపతి రాజయ్య, పదో వార్డు కౌన్సిలర్​ పనాస రాజు, టౌన్​ వైస్​  ప్రెసిడెంట్​ శ్రీనివాస్, కొట్టె రాజయ్య, రామకృష్ణా, లాడెన్, యూత్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ సల్లం కిరణ్, రాజేశం, భీమేశ్ పాల్గొన్నారు. 

నాన్ టీచింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి...

నాన్ టీచింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్​ డీఈవో  ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం కళావతి మాట్లాడారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. నేరడిగొండ కేజీబీవీలో తొలగించిన సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు. అనంతరం డీఈవో ప్రణీతకు వినతి పత్రం అందజేశారు. నిరసనలో అసోసియేషన్​జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, సుల్తానా, ప్రేమల, లక్ష్మి, రుతిక , వేదవతి, యశోద, కవిత, పుష్ప, జమున పాల్గొన్నారు.

నాలుగేళ్లుగా సీఎంపీఎఫ్​ చీటీలు ఇస్తలేరు..

సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు నాలుగేళ్లుగా సీఎంపీఎఫ్​ చీటీలు ఇవ్వడంలేదని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఇప్టూ) స్టేట్​ప్రెసిడెంట్​ డి.బ్రహ్మానందం, స్టేట్​అసిస్టెంట్​సెక్రటరీ ఎండీ జాఫర్​ఆరోపించారు. రామకృష్ణాపూర్ సింగరేణి సివిల్ ఆఫీస్​ ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ గైడ్​ లైన్స్ ప్రకారం ప్రతీ నెల 7న వేతనాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఏరియా కేకే ఓపెన్​కాస్ట్ మైన్​ మేనేజర్ మల్లన్నకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో లీడర్లు గజ్జి మల్లేశ్, నడిగోట శంకర్, ముత్యాల వెంకటేశ్, నిరంజన్, అప్పారావు, రామస్వామి, ప్రసాద్, నరేశ్, ప్రభాకర్, శ్రీనివాస్, మహేశ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు పరిష్కరించాలి...

పీఆర్సీ ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆర్టిజన్​ కార్మికులు మంచిర్యాల టీఎస్ఎన్​పీడీసీఎల్​ఆఫీస్​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. యునైటెడ్ ​ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్​(సీఐటీయూ) ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. ఉద్యోగులకు ఏప్రిల్ 2022 నుంచి పీఆర్సీ రావాల్సి ఉందన్నారు. ఇంత వరకు వేతన ఒప్పందం జరగకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. విద్యార్హతల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. నిరసనలో యూనియన్ మంచిర్యాల సర్కిల్​ ప్రెసిడెంట్​చిందం వెంకటేశ్, జనరల్​సెక్రటరీ సుంకరి సదానందం, వైస్​ ప్రెసిడెంట్ పసుల తిరుపతి, అరుణ్​కుమార్, శ్రీనివాస్, కాళీదాస్, నరేశ్, అంజి తదితరులు పాల్గొన్నారు. 

ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆసిఫాబాద్, నిర్మల్​లో సెకండ్​ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్​లో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడారు. రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా సెకండ్​ఏఎన్ఎంలు వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్,సెకండ్ ఏఎన్ఎం లు  పుణ్యబాయి, భాగ్యలక్ష్మి, సునీత, ప్రమీల, వసంత, రజిని, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్​లో జరిగిన నిరసనలో వైద్య ఉద్యోగుల సంఘం 3194  జిల్లా అధ్యక్షుడు కె. కృష్ణమోహన్ గౌడ్ మాట్లాడారు. కంటి వెలుగు పథకం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ సెకండ్​ఏఎన్​ఎంలకు శుభవార్త చెప్పాలన్నారు. నిరసనలో సంఘం జిల్లా ట్రెజరర్​వేణుగో పాల్​రావు, లీడర్లు భోజారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.