ఎల్ఐసీని ప్రైవేటైజేషన్ చేయొద్దు.. ఎంప్లాయీస్ నిరసన

ఎల్ఐసీని ప్రైవేటైజేషన్ చేయొద్దు.. ఎంప్లాయీస్ నిరసన

ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీసు ఎదుట ఎంప్లాయీస్ నిరసన

సైఫాబాద్,వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ని ప్రైవేటు పరం చేయొద్దంటూ సెక్రటేరియట్ దగ్గరలోని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీసు ఎదుట లంచ్ టైమ్ లో ఎంప్లా యీస్ నిరసన తెలిపారు. ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లా యీస్ ఫెడరేషన్ నుంచి పి.మహేష్ , ఎల్‌ఐసీ క్లాస్-1 ఆఫీసర్స్ ఫెడరేషన్ నుంచి పీఎస్వీ ప్రసాద్ , ఆల్ ఇండియా ఇన్సూరె న్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి శ్రీకాంత్ మిశ్రా మాట్లాడా రు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.