ఈపీఎఫ్ఓ వడ్డీ జమ.. చెక్ చేసుకోండిలా..!

ఈపీఎఫ్ఓ వడ్డీ జమ.. చెక్ చేసుకోండిలా..!

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) వడ్డీని ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా జమ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ 2020–-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటును 8.5 శాతానికి తగ్గించింది. వడ్డీరేటును 2019–-20 ఆర్థిక సంవత్సరంలో ఏడేళ్ల కనిష్టం 8.5 శాతానికి తగ్గించింది . మొత్తం ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్‌‌‌‌‌‌‌‌డ్రాయల్స్ ఉన్నందున  కిందటి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును మార్చలేదు. అయితే 2018–-19 ఆర్థిక సంవత్సరంలోనూ ఈపీఎఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగానే ఉంది. 2017-–18 ఆర్థిక సంవత్సరానికి ఇది 8.55 శాతంగా ఉండగా, 2016-–17 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఎఫ్ 8.65 శాతం వడ్డీ ఇచ్చారు. 
పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి?
ఈపీఎఫ్ఓలో దాదాపు 6 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఈ నెలాఖరులోపు వడ్డీని క్రెడిట్ చేస్తారు కాబట్టి వచ్చే వారం తమ పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేసుకోవాలని సంస్థ ఆఫీసర్లు సూచించారు. సాధారణంగా ఏదైనా ఒక వర్కింగ్‌‌‌‌‌‌‌‌ డేలో ఈపీఎఎఫ్ వడ్డీని  క్రెడిట్ చేస్తుంది. బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్లో లాగిన్‌‌‌‌‌‌‌‌ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. 
మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ చెక్
పీఎఫ్​ బ్యాలెన్స్​ తెలుసుకోవడానికి 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్​ చేయాలి. 
ఎస్ఎంఎస్  ద్వారా  
పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి.   యూఏఎన్​ అని ఉన్న చోట ఆ  నంబర్ ను టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ అందిన తరువాత  పీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది.