
- షెడ్యూల్ రాగానే పోస్టర్లు, బ్యానర్లు, గోడలపై రాతలు, హోర్డింగులు తొలగించాలి
- GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించకూడదని బల్దియా కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ నోడల్అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో శనివారం సమీక్షించారు.
ఎన్నికల శిక్షణ కార్యక్రమాల్లో రిటర్నింగ్ అధికారి పాల్గొని నోడల్ అధికారులకు వారి బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పోస్టర్లు, బ్యానర్లు, గోడలపై రాతలు, హోర్డింగులను తొలగించాలన్నారు. అడిషనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అలివేలు మంగతాయారు, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, హేమంత్ సహదేవరావు, కె.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.